మొక్కలు నాటి సంరక్షించాలి: ఎమ్మెల్యే కుంభం
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:35 AM
హరిత భువనగిరి లక్ష్యంగా అందరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

భువనగిరి టౌన, జూలై 16: హరిత భువనగిరి లక్ష్యంగా అందరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలో ఆయన వనమహోత్సవాన్ని ప్రారంభించి మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల సుందరీకరణ మొక్కలను నాటి సంరక్షించడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. త్వరలోనే జూనియర్ కళాశాల ప్రహారీని నిర్మించి వాకింగ్ పాత, అథ్లెటిక్ ట్రాక్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ గంగాధర్, కమిషన పి.రామాంజల్‌రెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన అధ్యక్షుడు డాక్టర్ బి.సూర్యనారాయణరెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పి.జలేందర్‌రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
స్పృహ తప్పిన బాలిక
వన మహోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10గంటలకు వన మహోత్సవం ప్రారంభం కావాల్సి ఉండగా అతిథుల రాక కారణంగా రెండు గంటల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. ఓ బాలిక స్పృహతప్పి పడిపోవడంతో అప్రమత్తమైన ఉపాఽధ్యాయులు, సహచర విద్యార్థులు చేపట్టిన సపర్యలతో కోలుకుంది. అనంతరం విద్యార్థినిని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పరామర్శించి, ఆసుపత్రికి తరలించారు.