స్కాలర్షిప్లను విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:56 AM
విద్యార్థుల పెండింగ్ స్కాలర్షి్పలు, ఫీజు రీయింబర్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎ్ఫఐ జిల్లా కార్యదర్శి ఎల్.రాజు డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ టౌన, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల పెండింగ్ స్కాలర్షి్పలు, ఫీజు రీయింబర్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎ్ఫఐ జిల్లా కార్యదర్శి ఎల్.రాజు డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ పట్టణంలో ఎస్ఎ్ఫఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. డీవైఎ్ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె మధు, ఎస్ఎ్ఫఐ నాయకులు టి.శ్రీనివాస్, జగననాయక్, ప్రకాష్, ఆర్.మధు, రామ్, నందు, విక్రమ్, అఖిల్ పాల్గొన్నారు.