కాలనీల్లో మురుగునీరు తొలగింపు
ABN , Publish Date - May 23 , 2024 | 12:39 AM
చౌటుప్పల్ పట్టణంలోని రాంనగర్, గణేష్ నగర్ కాలనీల్లో నిలిచిన మురుగు నీటిని బుధవారం మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేసి తొలగించారు.
చౌటుప్పల్ టౌన, మే 22: చౌటుప్పల్ పట్టణంలోని రాంనగర్, గణేష్ నగర్ కాలనీల్లో నిలిచిన మురుగు నీటిని బుధవారం మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేసి తొలగించారు. ‘పారిశుధ్యం అస్తవ్యస్తం’ అనే శీర్షికతో ఈ నెల 22న ప్రచురితమైన కథనానికి మునిసిపల్ చైర్మన వెనరెడ్డి రాజు, కమిషనర్ ఎన.వెంకటేశ్వర నాయక్ వెంటనే స్పందించి తగిన చర్యలను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు 13వ వార్డులోని రాంనగర్, 14వ వార్డులోని గణేష్ నగర్ ప్రాంతాల్లో మురుగు నీరు నిలిచి దుర్గంధం ప్రబలింది. దీంతో కాలువలను శుభ్రం చేయించి, మురుగునీటిని తొలగించి వేశారు. వర్షాలకు కాలువల్లో చెత్తా చెదారం అడ్డుపడడంతో మురుగు నీరు ముందుకు వెళ్లలేక గుంతల్లో నిలిచి పోయింది. కోర్టు సమీపంలోని ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలిచి చెరువును తలపించే విధంగా మారింది. మురుగు నీరు బయటకు వెళ్లి పోయేందుకు పారిశుధ్య కార్మికులు ప్రత్యేక కాలువలను ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయ్యింది. శుభ్రం చేసిన కాలువల ద్వారా మురుగు నీరు సజావుగా ముందుకు వెళ్లిపోతుండడంతో కాలనీల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.