గోదావరి జలాల సాధనకోసం పోరాటం
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:35 AM
మూసీ ప్రక్షాళన, బునాదిగాని, భీమలింగం కాల్వల ద్వారా గోదావరి జలాల సాధనకోసం పోరాటాలను నిర్వహించాలని మూసీ ప్రక్షాళన గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు పిలుపునిచ్చారు.
వలిగొండ, సెప్టెంబరు 6: మూసీ ప్రక్షాళన, బునాదిగాని, భీమలింగం కాల్వల ద్వారా గోదావరి జలాల సాధనకోసం పోరాటాలను నిర్వహించాలని మూసీ ప్రక్షాళన గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మూసీ ప్రక్షాళనపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల కిత్రం స్వచ్ఛమైన నీటిని అందించిన మూసీ నేడు కాలుష్యంగా మారిందన్నారు. ఈ మూసీ ప్రాంలో ఉన్న గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గౌరవ సలహాదారులు ఎండీ.జహంగీర్, బట్టు రాంచంద్రయ్య, జిల్లా కో కన్వీనర్ సిర్పంగి స్వామి, కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, మేక అశోక్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రరెడ్డి, జిల్లా నాయకులు మద్దెల రాజయ్య, నర్సింహ, వెంకటేశ, వెంకటనర్సు, శ్రీనివాస్, బిక్షం, సురేందర్, శ్రీశైలంరెడ్డి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : అసంపూర్తిగా ఆగిపోయిన బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 11 వరకు చేపట్టనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మూసీ ప్రక్షాళన-ప్రత్యామ్నాయ గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో-కన్వీనర్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని కూరెళ్ల గ్రామంలో బైక్‌ర్యాలీ కరపత్రాలను విడుదల చేశారు. కాల్వ పనులు త్వరగా పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేసి, గోదావరి జలాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీలో రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం, నాయకులు రచ్చ గోవర్థన, బి.రాములు, టి.సత్యనారాయణరెడ్డి, బీరయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, సత్తయ్య, సాయిలు, నరసయ్య పాల్గొన్నారు.