తెలంగాణను కాపాడుకునేందుకు పోరాటం
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:32 PM
కేసీఆర్ నేతృత్వం లో మరోమారు కాంగ్రెస్ దుష్టపాలనపై పోరాడేందుకు బీఆర్‌ఎస్ శ్రేణుల సిద్ధం కావాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ దీక్షా దివ్‌సలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంకావాలి
ఎమ్మెల్సీ శ్రీనివా్‌సరెడ్డి
ఉత్సాహంగా దీక్షా దివస్
భువనగిరి టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ నేతృత్వం లో మరోమారు కాంగ్రెస్ దుష్టపాలనపై పోరాడేందుకు బీఆర్‌ఎస్ శ్రేణుల సిద్ధం కావాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ దీక్షా దివ్‌సలో ఆయన మాట్లాడారు. 2009, నవంబరు 9న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటు పై అనుకూల ప్రకటన చేసిందని, కానీ ఆంధ్ర నాయకులనుంచి వచ్చిన ఒత్తిడితో మరుసటి రోజే ప్రకటనను ఉపసంహరించుకున్నద ని ఆరోపించారు. అయినప్పటికీ కేసీఆర్ సాగించిన పోరాటాల ఫలితంగా తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో తెలంగాణ ను ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే పదేళ్ల పాలనలో కేసీఆర్ తీర్చిదిద్దిన బంగారు తెలంగాణను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించా రు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు కేసులకు భయపడరని, వారి ఒంటినిండా ఉద్యమస్ఫూర్తి ఉందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు నాయకులు,కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.
పార్టీని వీడిన వాళ్లంతా మోసగాళ్లు : కంచర్ల
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పదేళ్లపాటు పదవులు అనుభవించి ఎన్నికల్లో ఓడిన వెంటనే పార్టీని వీడిన నాయకులందరూ మోసగాళ్లని, వారందరికీ పార్టీ కార్యకర్తల ఉసురు తగులుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొం గిడి సునీత మహేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడు తూ కేవలం కేసీఆర్ రగిలించిన ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం ఆ విర్భవించిందని, అదే స్ఫూర్తితో నేటి మోసపూరిత కాంగ్రెస్ పాలనపై పోరాడుదామని, ఇందుకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా మలుచుకోవాలన్నారు. ముందుగా అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు, మునిసిపల్ మాజీ చైర్మన్లు కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివా్‌సరెడ్డి, మా జీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.