సర్వేత్రా కష్టాలే
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:23 AM
ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5లక్షల ఆర్థిక సాయం అందించనుంది. అందుకు ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా సర్వే నిర్వహిస్తోంది.
ఇందిరమ్మ ఇంటి సర్వేలే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది
జిల్లాలో 2,01,977 దరఖాస్తులకు 1,14,440 ఇళ్ల సర్వే
(ఆంధ్రజ్యోతి,భువనగిరి రూరల్): ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5లక్షల ఆర్థిక సాయం అందించనుంది. అందుకు ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు సర్వేకు చివరి గడువు కాగా, జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో సర్వే వివరాలు యాప్‌లో నమోదు చేయా ల్సి ఉండగా, సర్వర్ సమస్యతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వే కొనసాగుతుండగా, కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సమస్య ఉంది. దీంతో సిబ్బంది సర్వే వివరాలను ఆఫ్‌లైన్‌లో నమోదుచేసి నెట్‌వర్క్ సిగ్నల్ ఉన్న గ్రామాలకు వచ్చి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో సర్వేలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఇప్పటి వరకు జిల్లాలో 56.65శాతం మాత్రమే సర్వే పూర్తయింది.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 16నుంచి ఇందిర మ్మ ఇళ్ల సర్వేను అధికారులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి ఇళ్ల దరఖాస్తుదారుడి నుంచి సమాచారం సేకరించి నమోదు చేస్తున్నారు. వృత్తి, వయసు, ఇంటి స్థలం వివరా లు ఫొటో సహా అప్‌లోడ్ చేయాల్సి ఉండగా, నెట్‌వర్క్ సమస్య తలెత్తుతోంది. ఫలింతంగా ఒక్కో ఇంటి సర్వే విరాల నమోదుకు సుమారు 50నిమిషాల సమయం పడుతుండడంతో సర్వే సిబ్బంది కొంత అసహనానికి గురవుతున్నారు. సర్వే సిబ్బందికి ఇచ్చిన శిక్షణ తరగతుల సమయంలో 20నుంచి 30నిమిషాల సమయం పడుతుందని అధికారులు చెప్పగా, సాంకేతిక సమస్యతో 50నిమిషాలకు పైగా సమయం పడుతోం ది. ఇక సర్వేకు వెళ్లిన సమయంలో దరఖాస్తుదారులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుండ డం, కొంత మంది వలసలకు వెళ్లి అందుబాటులోకి రాకపోవడంతో వారి కోసం వేచిచూడాల్సి వస్తుండటంతో సమయం వృథా అవుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. రోజుకు సుమారు 25 దరఖాస్తులు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, క్షేత్రస్థాయిలో ఉదయం 9గంటలకు సర్వే ప్రారంభిస్తున్నా 15 నుంచి 20 వరకే దరఖాస్తు ల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతున్నా యి. సుమారు 8గంటల పాటు సర్వేలో నిమగ్నమవుతున్నామని, నెలాఖరు వరకు గడువులోగా సర్వే పూర్తికావడం కష్టతరమేనని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఇంటి సర్వే యాప్‌లో సర్వర్ సమస్యలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 17మండలాలు, ఆరు మునిసిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ‘ప్రజాపాలన’లో 2,01,977 దరఖాస్తు వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు 1,14,440 దరఖాస్తుల సర్వే మాత్రమే పూర్తయింది. సర్వే పూర్తికి ఇంకా ఏడు రోజుల గడువు మాత్రమే ఉంది.
సర్వేకు సాంకేతిక సమస్యలు: సీహెచ్.శ్రీనివా్‌స, భువనగిరి ఎంపీడీవో
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే ప్రక్రియలో అప్పుడప్పుడు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో క్షేత్రస్థాయిలో వివరాల నమోదు ఆలస్యమవుతోంది. మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో ఆఫ్‌లైన్‌లో యాప్‌లో వివరాలు నమోదుచేసి నెట్‌వర్క్ వచ్చే ప్రాంతానికి వచ్చి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. సమాచారం ఎడిట్ చేసే క్రమంలో వృత్తి, వయసు తదితర వివరాల నమోదుకు సుమారు 15నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతోందని సర్వే సిబ్బంది నా దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో దరఖాస్తులు, సర్వే ఇలా..
మండలం/ వచ్చిన సర్వే పూర్తయిన శాతం
మునిసిపాలిటీ దరఖాస్తులు దరఖాస్తులు
అడ్డగూడూరు 8195 4014 48.98
ఆలేరు 6776 3480 51.36
ఆలేరు టౌన్ 3681 2787 75.71
ఆత్మకూర్ (ఎం) 8172 4379 53.59
భువనగిరి 12307 6114 49.69
భువనగిరి టౌన్ 9642 7893 81.86
బీబీనగర్ 12572 7326 58.27
బొమ్మలరామారం 9683 7038 72.68
భూదాన్‌పోచంపల్లి 8497 5490 64.61
పోచంపల్లి టౌన్ 3997 3505 87.69
చౌటుప్పల్ 11129 6506 58.46
చౌటుప్పల్ టౌన్ 6808 5931 87.12
గుండాల 9153 4175 45.61
మోటకొండూరు 6624 4298 64.89
మోత్కూరు 4683 2239 47.81
మోత్కూరు టౌన్ 4292 4556 99.16
నారాయణపూర్ 13647 3505 50.76
రాజాపేట 9991 5073 50.78
రామన్నపేట 14634 7626 52.11
తుర్కపల్లి 10291 5364 52.12
వలిగొండ 16157 7034 43.54
యాదగిరిగుట్ట 7716 3474 45.02
గుట్ట టౌన్ 3330 2633 79.07
మొత్తం 2,01,977 1,14,440 56.65