ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:41 AM
పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) రాష్ట్ర చైర్మన్ జి.సదానందంగౌడ్ డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) రాష్ట్ర చైర్మన్ జి.సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గుట్టలో జాక్టో, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య సంఘాల సంయుక్త నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్‌సీ నివేదికను తెప్పించుకుని సత్వరమే అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జాక్టో బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పూల రవీందర్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. నాయకులు కె.కృష్ణుడు, అబ్దుల్లా, హేమచంద్రుడు, దానయ్య పాల్గొన్నారు.