Share News

తెలంగాణ అస్తిత్వం ఢిల్లీ బాసులకు తాకట్టు

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:31 AM

తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ ఆరోపించారు.

తెలంగాణ అస్తిత్వం ఢిల్లీ బాసులకు తాకట్టు
తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్‌, నాయకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ ఆరోపించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినందుకు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ విగ్రహానికి పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్‌ తల్లి హస్తం రూపాన్ని తీసుకవచ్చిన సీఎం రేవంతరెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణ బతుకమ్మ పండుగకు ప్రతీకగా నాటి ఉద్యమ సారధి కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా విగ్రహాల రూపాలను మార్చడం, తెలంగాణ రాష్ట్ర గీతాలను మార్చడం వంటి పనులు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో నిమగ్నం కావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం, తూడి నర్సింహారావు, బూర బాలసైదులుగౌడ్‌, జీవనరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, ఉప్పల ఆనంద్‌, గండూరి కృపాకర్‌, ఆకుల లవకుశ, తాహేర్‌పాష, మామిడి అంజయ్య, బత్తుల జానీయాదవ్‌, రమణారెడ్డి, ఈదుల యాదగిరి, ఉప్పల సైదులు, అనిల్‌రెడ్డి, చింతలపాటి మధు, కరుణశ్రీ, రియాజ్‌, రఫీ, క్రిష్ణ, ప్రసాద్‌, శశికాంత, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:31 AM