పది రోజులు సంస్మరణ దినోత్సవాలు
ABN , Publish Date - Oct 17 , 2024 | 12:22 AM
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సనప్రీతసింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
21 నుంచి 31వ తేదీ వరకు : ఎస్పీ
సూర్యాపేటక్రైం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సనప్రీతసింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విధినిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పోలీస్ విధులు, టెక్నాలజీ వినియోగం, రక్తదాన శిబిరాలు, ఓపెన హౌస్, అమరవీరుల కుటుంబాల సందర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కొవ్వొత్తుల ర్యాలీ, సైకిల్ ర్యాలీ, పోలీస్ ప్రతిభ తెలిపే లఘుచిత్రాల పోటీలతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఇం టర్ విద్యార్థుల వరకు ‘విచక్షణతో కూడిన మొబైల్ ఫోన వాడకం’ అంశంపై, డిగ్రీ ఆపై విద్యార్థులకు ‘తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో నా పాత్ర’ అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి బహుమతులు అందజేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మూడు ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. దీంతో పాటు లఘు చిత్రాలు, ఫొటోల పోటీల్లో పోలీ్‌సల త్యాగాలు, పోలీస్ విధుల్లో ప్రతిభను తెలిపేలా ఉండే తక్కువ నిడివి గల షార్ట్ ఫిల్మ్స్, ఇటీవలి ఫొటోలు, వ్యాసాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు పోటీల్లో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు పోలీస్ పీఆర్‌వో సెల్:7013923377ను సంప్రదించాలన్నారు.