వేధిస్తున్నాడనే ఇతరులతో కలిసి భర్త హత్య
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:57 PM
నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి శివారులో జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
డిండి, అక్టోబరు 1 : నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి శివారులో జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దేవరకొండ డీఎస్పీ గిరిబాబు మంగళవారం డిండి పోలీ్‌సస్టేషనలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డిండి మండలం కామేపల్లికి చెందిన నకిరేకంటి అంజమ్మ, సాయిలుకు నలుగురు కుమార్తెలు. చిన్నకుమార్తె రమాదేవిని గుర్రంపోడు మండలం కొప్పొలు గ్రామానికి చెందిన శ్రీపతి జగదీష్(35) పదేళ్ల కిందట జగదీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. పలుమార్లు డిండి పోలీ్‌సస్టేషనలో వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా విడివిడిగా ఉంటున్నారు. జగదీష్ భార్య రమాదేవి తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. జగదీష్ వరుసకు కుమార్తయ్యే బాలికను ఆరు నెలల కిందట బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలికను వెంటనే తమ గ్రామానికి తీసుకువచ్చారు. ఇది సరైన పద్ధతికాదని నచ్చజెప్పినా వినకుండా సెల్‌ఫోన గ్రూపుల్లో బాలికతో దిగిన ఫొటోలను జగదీష్ పోస్టు చేసి వేధిస్తున్నాడు. బాలిక తండ్రి హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీసులకు జగదీ్‌షపై ఫిర్యాదుచేశాడు. అక్కడి పోలీసులు జగదీ్‌షపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయినా తీరుమార్చుకోకపోవడంతో జగదీ్‌షపై భార్య రమాదేవి, సడ్డకుడు, అతడి, కుమారులు కక్ష పెంచుకున్నారు. హైదరాబాద్ అల్వాల్‌లో నివాసముంటున్న జగదీష్ ఇంటికి సెప్టెంబరు 27న ఉదయం ఆరు గంటలకు భార్య రమాదేవి, సడ్డకుడు కుటుంబసభ్యులతో కలిసివెళ్లారు. కులపెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి జగదీ్‌షను కాళ్లు, చేతులు కట్టి అరవకుండా చున్నీతో నోరుకట్టారు. అద్దెకు తీసుకున్న కారులో దేవరకొండ మీదుగా చెర్కుపల్లి గ్రామ శివారులోకి చేరుకున్నారు. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో జగదీ్‌షను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బండరాయితో మోది హత్యచేశారు. సెప్టెంబరు 28న గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, సీఐ సురేష్ సంఘటనా స్థలాన్ని చేరుకొని సీసీ కెమెరాలు పరిశీలించి ఎస్‌ఐలు రాజు, సతీ్‌షలతో బృందాన్ని ఏర్పాటుచేశారు. కామేపల్లి గ్రామంలో తలదాచుకున్న నిందితులను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని విచారించడంతో మిస్టరీ వీడిందన్నారు. 48 గంటల్లో ప్రత్యేక బృందం కేసు మిస్టరీని ఛేదించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రత్యేక బృందంలో ఉన్న సీఐ సురేష్, డిండి ఎస్‌ఐ రాజు, చందంపేట, నేరేడుగొమ్ము ఎస్‌ఐలు సతీ్‌షలు, డిండి కానిస్టేబుల్ హుస్సేన, సైదమ్మ, హోంగార్డులు తిరుపతి, గణే్‌షలను ఎస్పీ అభినందించి, రివార్డు ప్రకటించినట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు.