Share News

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై నిలదీయాలి: బ్రజేష్‌పాఠక్‌

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:23 AM

కుంభకోణాలకు కాం గ్రెస్‌ పార్టీ కేరాఫ్‌ అని, నరేంద్ర మోదీ దేశ ప్రధాని కాకముందు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిం దని ఉత్తరప్రదేశ ఉపముఖ్యమంత్రి బ్రజేశపాఠక్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై నిలదీయాలి: బ్రజేష్‌పాఠక్‌
నల్లగొండ: విజయ సంకల్ప యాత్రలో మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌పాఠక్‌

రామగిరి/సూర్యాపేట సిటీ/కోదాడ, మార్చి 1: కుంభకోణాలకు కాం గ్రెస్‌ పార్టీ కేరాఫ్‌ అని, నరేంద్ర మోదీ దేశ ప్రధాని కాకముందు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిం దని ఉత్తరప్రదేశ ఉపముఖ్యమంత్రి బ్రజేశపాఠక్‌ అన్నారు. శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లాలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అవినీతి, అక్రమాల కు పాల్పడిన కార గ్రెస్‌ నాయకులు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీల మంత్రులు జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హామీలను అమలయ్యేలా నిలదియాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాంటి అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాడు దేశప్రజలు నరేంద్రమోదీని అఖం డ మెజారిటీతో రెండుసార్లు గెలిపించారన్నారు. మూడోసారి కూడా ప్రజలు రెండుసార్లు కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కట్టి చూపించారన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం స్వచ్ఛభారత పేరిట మరుగుదొడ్లను నిర్మించినట్లు, ఇంటింటికీ మంచినీరు ఉజ్వల యోజన కింద కోట్లాది మందికి గ్యాస్‌ కనెక్షన ఇచ్చినట్లు వివరించారు. మోదీ ప్రవేశపెట్టిన ప్రతీ పథకం అట్టడుగు వర్గాలకు చేరుకుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమా ర్‌, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నర్సింహారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌, శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు.

400 ఎంపీ స్థానాలను గెలుస్తుంది

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ స్థానాలను గెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమో దీ మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర నేత, విజ య సంకల్ప యాత్ర ప్రముఖ్‌ నెల్లి శ్రీవర్ధనరెడ్డి అన్నా రు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు కోదాడ పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. గల్లీలో మనం క్షేమంగా ఉండాలంటే ఢిల్లీలో మోదీ ఉండాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం లక్ష కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో 15 సీట్లు ఇస్తే, అంతకన్నా రెట్టింపు నిధులు రాష్ర్టానికి తెచ్చుకోవచ్చన్నారు. 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను బీజేపీ ప్రభుత్వం నిర్మించిందన్నారు. బీఆర్‌ఎస్‌ దేశంలోనే అ వినీతి పాలన అందించిన రాష్ట్రంగా మారిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సం కినేని వెంకటేశ్వరరావు, బీజేపీ కిసాన మోర్చ జాతీ య నాయకుడు గోలి మధుసూదనరెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ బండారు ప్ర సాద్‌, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, పార్లమెంటు కో- కన్వీనర్‌ తుక్కాని మన్మథరెడ్డి, కోదాడ అసెంబ్లీ కన్వీనర్‌ కనగాల నారాయణ, సీనియర్‌ నాయకులు కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, బొలిశెట్టి క్రిష్ణయ్య, మన్మధరెడ్డి, గార్లపాటి జి తేంద్రకుమార్‌, యాదా రమేష్‌, ఓరుగంటి కిట్టు, వంగవీటి శ్రీనివాసరావు, చిలుకూరు శ్రీను, చల్లమళ్ల నరసింహా, పోలగాని ధనుంజయ్‌ గౌడ్‌, వెన్న శశిధర్‌రెడ్డి, పల్స మల్సూర్‌ గౌడ్‌, సలిగంటి వీరేందర్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2024 | 12:23 AM