Share News

సమాజంలో పోలీసుల పాత్ర మరవలేనిది

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:58 AM

వచ్చే 10 రోజుల్లో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును నీటితో నింపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

సమాజంలో పోలీసుల పాత్ర మరవలేనిది

రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ/నల్లగొండ టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర మరవలేనిదని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీ్‌సపరేడ్‌ మైదానంలో నిర్వహించిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పోలీస్‌ అమరులకు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం ప్రాణాలర్పించడానికైనా వెనకాడని సేవకులు పోలీసులు అని కొనియాడారు. పోలీ్‌సస్టేషన్‌ అంటే భయపెట్టే కేంద్రం కాదని, బాధలను తీర్చే కేంద్రమన్నారు. విధి నిర్వహణలో జిల్లాలో సుమారు 15 మంది పోలీసులు అమరులయ్యారని, వారి కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు చేయుతనందించే విషయంపై సీఎంతో చర్చించి ఆదుకుంటామన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.25వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. తక్షణ సాయంగా ఒక్కొకరికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. వారి పిల్లల ఉన్నత చదువులకు అవసరమయ్యే ఖర్చులకు సైతం అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సినారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ టి.పూర్ణచంద్ర, మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, జడ్పీ మాజీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకూరి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

10 రోజుల్లో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులో నీరు

నల్లగొండటౌన్‌: వచ్చే 10 రోజుల్లో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును నీటితో నింపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. నల్లగొండ మండలం ఖాజీ రామారంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.20లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గతంలో ఖాజీరామారం గ్రామానికి బీటీ రోడ్డు వేయించానని, సబ్‌స్టేషన్‌ నిర్మించానని, ఇటీవల డీ-39 కాల్వను శుభ్రం చేయించినట్టు తెలిపారు. ఖాజీరామారంలో గత పదేళ్లలో ప్రభుత్వం ఒక్క ఇంటిని కట్టలేదన్నారు. గ్రామానికి 50 ఇళ్లు మంజూరుచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీదేవి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ సభ్యులు లక్ష్మయ్య, పాశం రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మాడ్గులపల్లి: మాడ్గులపల్లి మండల కేంద్రంలో రూ.50లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలం ఏర్పాటైనా పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు లేవని, ప్రభుత్వ స్థలం మూడు ఎకరాల్లో ఎంపీడీవో, పోలీ్‌సస్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణాల కు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. మాడ్గులపల్లి-మామిడాల వరకు డబుల్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో చిరుమర్తి-సూర్యాపేట వరకు డబుల్‌ రోడ్డు పనులను చేపడతామన్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. మండల కేంద్రంలో ఉన్న నల్లకుంట చెరువును నింపేందుకు రూ.2లక్షలతో మోటార్లు ఏర్పాటుచేయిస్తానన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌, ఎంపీడీవో స్వామి, తహసీల్దార్‌ పద్మ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, జడ్పీ మాజీ సభ్యుడు పుల్లెంల సైదులు, గోపాల్‌రెడ్డి, నరసింహా, సైదిరెడ్డి, వెంకన్న, నరేష్‌, పురుషోత్తంరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, యాదయ్య, లచ్చయ్య, యాదగిరి, వెంకట్‌రెడ్డి, సిద్దార్ధరెడ్డి, బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:58 AM