Share News

అమరుల త్యాగాలు మరవలేనివి

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:45 AM

శాంతి భద్రతల రక్షణలో పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ అన్నారు.

అమరుల త్యాగాలు మరవలేనివి
పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌, ఎస్పీ సనప్రీతసింగ్‌

కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

సూర్యాపేట టౌన, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : శాంతి భద్రతల రక్షణలో పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ సనప్రీతసింగ్‌తో కలిసి హాజరై ఆయన మాట్లాడారు. ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసుల కృషి అన్నారు. యువత పోలీ్‌సశాఖలో ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. యువతతో పాటు మహిళలు కూడా రక్షణ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపాలన్నారు. పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎస్పీ సనప్రీతసింగ్‌ మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరులకు అందించే నివాళులు వారి కుటుంబాల్లో మానసిక బలాన్ని పెంపొందిస్తోందన్నారు. పోలీసులు రాత్రీపగలు విరామం లేకుండా విధులు నిర్వహిస్తూ సంఘ విద్రోహులతో నిత్యం పోరాడుతున్నారని తెలిపారు. వీరమరణం పొందిన పోలీస్‌ త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీస్‌ శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. జిల్లా పోలీస్‌ కళాజాత బృందం అలపించిన గేయాలు అందరిని ఉత్తేజింపజేశాయి. పోలీస్‌ అమరవీరులు బడేసాబ్‌, లింగయ్య, మహే్‌షలకు జోహార్లు అర్పించి వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మానాయక్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ జనార్ధనరెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీనివాస్‌, ఏఆర్‌డీఎస్పీ నర్సింహాచారి, ఏవో మంజుభార్గవి, అమరుల కుటుంబసభ్యులు, పోలీస్‌ సంక్షేమ సంఘం సభ్యులు వెంకన్న, సీఐ వీరరాఘవులు, రాజశేఖర్‌, సురేందర్‌రెడ్డి, శ్రీను, రఘువీర్‌రెడ్డి, రాయకృష్ణరెడ్డి, రజితరెడ్డి, రాము, లక్ష్మీనారాయణ, శివకుమార్‌, ఆర్‌ఐలు నారాయణరాజు, నర్సింహా, ఎస్‌ఐ, ఆర్‌ఎ్‌సఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:45 AM