Share News

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర

ABN , Publish Date - Jan 25 , 2024 | 11:33 PM

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర అని జిల్లా న్యాయాధికారి రాజగోపాల్‌ అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర
జాతీయ ఓటర్ల దినోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయాధికారి జీ రాజగోపాల్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర అని జిల్లా న్యాయాధికారి రాజగోపాల్‌ అన్నారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్‌రెడ్డిలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన వారందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కు పొందిన యువతకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఓటరు అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి జెండా ఊపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ రాజే్‌షమీనా, ఇనచార్జి ఆర్‌డీవో కృష్ణయ్య, తహసీల్దార్లు ఽశ్యాంసుందర్‌రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ కార్యాలయంలో ...

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎస్పీ రాహుల్‌హెగ్డే పోలీస్‌ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అదికారి రాజే్‌షమీనా, అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 11:33 PM