Share News

సర్వేను దేశమంతా గమనిస్తోంది

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:34 AM

సర్వేను దేశమొత్తం గమనిస్తుదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎస్‌ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమా ర్‌ సుల్తానియా, కలెక్టర్లతో కలిసి శనివారం ఆయన ఇంటింటి కుటుంబ సర్వేపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

సర్వేను దేశమంతా గమనిస్తోంది

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

భువనగిరి కలెక్టరేట్‌, నవంబరు 9(ఆంధ్రజ్యో తి): సర్వేను దేశమొత్తం గమనిస్తుదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎస్‌ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమా ర్‌ సుల్తానియా, కలెక్టర్లతో కలిసి శనివారం ఆయన ఇంటింటి కుటుంబ సర్వేపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇంటింటికి స్టిక్కర్లను పూర్తి చేసుకున్న తర్వాత సర్వేను ఎన్యుమరేటర్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. సర్వేలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేసి ఒక వేళ సందేహాల ను కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వేపై ప్రజలతో మమేకమైతే వారి సందేహాలు ఏమిటో తెలుస్తాయన్నారు. అందరూ కలిసి కుటుంబ సర్వేను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గంగాధర్‌, వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పాల్గొన్నారు.

సర్వే ప్రక్రియలో మార్గదర్శకాలు పాటించాలి

సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యే వరకూ బా ధ్యతాయుతంగా మెలగాలని కలెక్టర్‌ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లాలన్నారు.

సర్వేకు అందరూ సహకరించాలి

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేకు అందరూ సహకరించాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. శనివారం భువనగిరిలో సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్యూమరేటర్లు అడిగే వివరాలన్నింటినీ ప్రజలు తెలపాలన్నారు. సర్వేపై అపోహలను వీడాలని, కేవలం రాష్ట్ర ప్రజల సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు, నూతన సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందన్నారు. సర్వేలో నిర్లక్ష్యం చూపవద్దన్నారు. రోజువారి సర్వే వివరాలను అదే రోజు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ చేయాల్సిందేనని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గంగాధర్‌, వీరారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి నాగిరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ పి.రామాంజుల్‌రెడ్డి, ఎంపీడీవో టి.నాగిరెడ్డి పాల్గొన్నారు. వలిగొండ: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. శనివారం మందపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

Updated Date - Nov 10 , 2024 | 12:35 AM