మేలు చేసేలా మార్కెటింగ్ విధానం ఉండాలి
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:21 AM
రైతులకు మేలు చేసేలా మార్కెటింగ్ విధానం ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్, లోక్‌సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
కట్టంగూరు, ఫిబ్రవరి 12 : రైతులకు మేలు చేసేలా మార్కెటింగ్ విధానం ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్, లోక్‌సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని గంగాదేవిగూడెంలో రైతు ఉత్పత్తిదారులు నిర్వహిస్తున్న కంపెనీని సోమవారం ఆయన సందర్శించారు. రైతు ఉత్పత్తిదారులు ఏర్పాటుచేసిన కంపెనీ రైతులకు మేలు చేసేలా ఆర్థికంగా బలపడాలన్నారు. కంపెనీలో రకరకాల ఉత్పత్తుల తయారీ విధానం చాలాబాగుందన్నారు. ఈ ఎఫ్‌పీవోను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో, జిల్లాలో ఏర్పాటుచేయాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టడం కోసం రైతులు వ్యవసాయం మీద ఆధారపడి సాగు చేస్తున్నారని, ప్రతీ రైతుకు గిట్టుబాటు ధర అందేలా వ్యవస్థ నడవాలన్నారు. దేశంలో పీఏసీఎస్ సొసైటీలకు ప్రభుత్వం రవాణా సదుపాయం ఇస్తుందని, అదే ప్రభుత్వం రూ.10వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేస్తామంటున్న ప్రభుత్వం, వాటికి ఉచితంగా ట్రాన్సపోర్ట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా నాబార్డు డీసీఎం వినయ్‌కుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఎండీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు ఎండీ రాజు, హెచవో రావుల విద్యాసాగర్, ఎఫ్‌పీవో చైర్మన చెవు గోని సైదమ్మ, ఐఆర్‌డీఎస్ చైర్మన రమేష్, డైరెక్టర్లు నంద్యాల అనంతరెడ్డి, బొల్లేపల్లి శేఖర్, లింగారెడ్డి, ధర్మారెడ్డి, రైతులు పాల్గొన్నారు.