ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు నేడే ఆఖరు
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:22 AM
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయు ల ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది. బుధవారం ఓట్ల నమోదుకు చివరి రోజు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29 నాటికి పూర్తి కానుండటం తో తదుపరి ఎన్నిక ల నిర్వహణకు ఓటరు జాబితాను రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు నెలాఖరు న షెడ్యూల్‌ను విడుదల చేసింది.
సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
5వ తేదీ సాయంత్రం వరకు 19,111ఓట్ల నమోదు
23న ముసాయిదా జాబితా 8 డిసెంబరు 30న తుది జాబితా
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయు ల ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది. బుధవారం ఓట్ల నమోదుకు చివరి రోజు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29 నాటికి పూర్తి కానుండటం తో తదుపరి ఎన్నిక ల నిర్వహణకు ఓటరు జాబితాను రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబరు నెలాఖరు న షెడ్యూల్‌ను విడుదల చేసింది.
సెప్టెంబరు 30వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. కాగా, మంగళవారం సాయంత్రం వరకు ఉపాధ్యాయ నియోజకవర్గంలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 19,111 ఓట్లు నమోదయ్యాయి. 6వ తేదీన చివరి రోజు కావడంతో ఓట్ల నమోదు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించి, దీనిపై అభ్యంతరాలను డిసెంబరు 9వ తేదీ వరకు స్వీకరిస్తారు. అదే నెల 25 వరకు అభ్యంతరాలు పరిశీలించి, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఇలా ఉంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఫారం-19 ద్వారా ఆఫ్‌లైన్‌లో స్వీకరించారు. ఆన్‌లైన్‌లో సైతం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు సైతం మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసారి జరిగే ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల ఉపాధ్యాయులకు సైతం ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ఓట్ల నమోదు కోసం అవగాహనతో పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. దీంతో పాటు పలువురు అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 ఓట్లు నమోదయ్యాయి. ఇంకా ఓట్ల నమోదుకు మరో రోజు గడువు ఉన్నందున్న వీటి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం నాటికి మూడు ఉమ్మడి జిల్లాలో ఓట్ల నమోదు ఇలా...
జిల్లా మండలాలు వచ్చిన దరఖాస్తులు
సిద్ధిపేట 04 128
నల్లగొండ 33 3,886
సూర్యాపేట 23 2201
యాదాద్రి 17 874
జనగాం 12 645
మహుబూబాబాద్ 18 988
వరంగల్ 13 1818
హనుమకొండ 11 3664
భూపాలపల్లి 07 196
భదాద్రి 23 1496
ఖమ్మం 21 2873
ములుగు 09 342
మొత్తం 191 19,111