Share News

ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:27 AM

ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ అంతటా ఒకేలా ఉండాలని, అందుకు విరుద్ధంగా ఉన్న అలైన్‌మెంట్‌ను మా ర్చాలని భూ నిర్వాసితుల ఐక్యవేదిక డిమాండ్‌ చేసిం ది. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహిం చి కలెక్టర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.

ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలి

కలెక్టరేట్‌ ఎదుట నిర్వాసితుల ఆందోళన

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 23 (ఆంధ్రజ్యో తి): ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ అంతటా ఒకేలా ఉండాలని, అందుకు విరుద్ధంగా ఉన్న అలైన్‌మెంట్‌ను మా ర్చాలని భూ నిర్వాసితుల ఐక్యవేదిక డిమాండ్‌ చేసిం ది. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహిం చి కలెక్టర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఔటర్‌ రింగు రోడ్డు నుంచి ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ 40కి.మీ దూరంలో ఉంటే, ఎన్‌హెచ్‌65, ఎన్‌హెచ్‌ 163 వద్ద 28కి.మీ వరకే తీసుకోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేసి 80శాతం మేరకు ఒప్పందం పొందాకే భూములు తీసుకోవాలనే నిబంధనలను అధికారులు పాటించడం లేదని ఆరోపించారు. గతంలో ఎన్‌హెచ్‌-65 వద్ద ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ దివీస్‌ ల్యాబొరేటరీ కంపనీ వెలుపల నుంచి ఉందని, ప్రస్తుతం దీన్ని మార్పు చేసి చౌటుప్పల్‌ పట్టణం నుంచి రహదారి వెళ్లేలా చేయడం దారుణమన్నారు. భూసేకరణ తప్పదంటే మున్సిపాలిటీల్లో బహిరంగ మార్కెట్‌ ధరకు రెండింతలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు ధర ఇవ్వాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని అన్నారు.

కలెక్టరేట్‌ వద్ద భారీ బందోబస్తు

కలెక్టరేట్‌లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తుండటం, ట్రిపుల్‌ఆర్‌ భూ నిర్వాసితుల ఆందోళన, సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబ స్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రతీ ఒక్కరిని తనిఖీ చేసి అనుమతించారు.

Updated Date - Dec 24 , 2024 | 12:27 AM