Share News

ఉదయసముద్రం కాల్వ అలైన్‌మెంట్‌ను మార్చాలి

ABN , Publish Date - Jan 31 , 2024 | 12:45 AM

చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో చేపట్టనున్న బి.వెల్లంల ఉదయసముద్రం కాల్వ అలైన్‌మెంట్‌ను మార్చాలని పలువురు రైతుల డిమాండ్‌ చేశారు. మంగళవారం రైతులతో నల్లగొండ ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు.

ఉదయసముద్రం కాల్వ అలైన్‌మెంట్‌ను మార్చాలి
సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్‌తో మాట్లాడుతున్న భూ నిర్వాసిత రైతులు

ప్రస్తుత అలైన్‌మెంట్‌ను వ్యతిరేకించిన రైతులు

చిట్యాలరూరల్‌, జనవరి 30: చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో చేపట్టనున్న బి.వెల్లంల ఉదయసముద్రం కాల్వ అలైన్‌మెంట్‌ను మార్చాలని పలువురు రైతుల డిమాండ్‌ చేశారు. మంగళవారం రైతులతో నల్లగొండ ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ, తమకు నష్టం కలిగించే అలైన్‌మెంట్‌ వద్దని వ్యతిరేకించారు. భూములు కోల్పోనున్న తమకు పరిహారాన్ని బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం చెల్లించాలని లేదంటే అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో భూముల ధరలు భారీగా ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం ఇస్తేనే తాము అంగీకరిస్తామని కొందరు రైతులు తేల్చి చెప్పగా అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందేనని మరికొందరు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరథ, ఇరిగేషన్‌ అధికారులు, సర్వేయర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2024 | 12:45 AM