Share News

ఉ..హు..హూ..

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:36 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చలి పులి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నాలుగు రోజులుగా 24 గంటలూ చల్లటి వాతావరణం ఉంటుండటంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది.

ఉ..హు..హూ..

నాలుగు రోజులుగా తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

17.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వణికిస్తున్న చలి

నల్లగొండ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చలి పులి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నాలుగు రోజులుగా 24 గంటలూ చల్లటి వాతావరణం ఉంటుండటంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చల్లటి గాలుల కారణంగా మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లాలనే వారు కూడా ఎండ వచ్చాకే ఇంటి బయటికి వస్తున్నారు. చాలా మంది పనులున్న వారు కూడా చల్లటి గాలులకు బయటికి వెళ్లలేకపోతున్నారు. ఆదివారం 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి గాలులతో చాలా మంది జ్వరాలు, ఒంటి నొప్పులుతో పాటు శ్వాస సంబంధిత వ్యాధులు, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాయామం, వాకింగ్‌ తగ్గి మధుమే హం, బీపీ బాధితులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలువురు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంటుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ గరిష్ఠం కనిష్ఠం

12 28.5 19.4

13 29.0 19.0

14 28.0 18.0

15 27.5 17.6

Updated Date - Dec 16 , 2024 | 12:36 AM