Share News

చౌటుప్పల్‌లో ఉరుములతో అకాల వర్షం

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:26 AM

చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది.

చౌటుప్పల్‌లో ఉరుములతో అకాల వర్షం

చౌటుప్పల్‌ టౌన, మార్చి 14: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దాదాపుగా అరగంట పాటు కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లదనంగా మారింది. ఎండిన వరి పంటలకు ఈ అకాల వర్షం కొంత ఉపశమనం కలిగింది. ఇప్పటికే ఎండి పోయిన వరి పంటలతో కొంత నష్టం జరిగి పోగా, మిగిలి ఉన్న వరి పంటలకు సైతం వర్షం నష్టం కలిగిస్తుందా అన్న ఆందోళన రైతులలో నెలకొంది.

Updated Date - Mar 15 , 2024 | 08:59 AM