సెర్ప్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా వెంకయ్య
ABN , Publish Date - Jan 27 , 2024 | 11:24 PM
తెలంగాణ సెర్ఫ్(ఎల్-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సూర్యాపేట రూరల్, జనవరి 27 : తెలంగాణ సెర్ఫ్(ఎల్-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సూర్యాపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రెమిడాల దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి నర్సయ్యగౌడ్, కోశాధికారిగా పబ్బతి లక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా శ్రీరాముల చంద్రశేఖర్‌లను ఎన్నుకున్నారు.