అంధులకు ద్రిస్టి నిర్దేశం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:30 AM
అంధులు మరొకరి తోడు లేకుండా ముందుకు సాగే పరిస్థితులు ఉండవు. వారు ప్రతిరోజూ అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. అయితే వారికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స(ఏఐ) అనేకవిధాల దోహదపడుతోంది.
(ఆంధ్రజ్యోతి -నల్లగొండ)
అంధులు మరొకరి తోడు లేకుండా ముందుకు సాగే పరిస్థితులు ఉండవు. వారు ప్రతిరోజూ అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. అయితే వారికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స(ఏఐ) అనేకవిధాల దోహదపడుతోంది. అంధుల నిత్యఅవసరాల్లో ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ద్రిస్టి ఏఐ ఎనేబుల్డ్ విజన కళ్లాద్దాలు అంధులకు ఆశాదీపంగా మారాయి. పేపరు చదవడంతో పాటు ఎదురుగా ఉండే వస్తువుల గురించి వివరిస్తుంది. అమెరికాలో తయారైన ఈ కళ్లాద్దాలను ఇటీవల కిమ్స్ ఫౌండేషన కొనుగోలు చేసింది. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా ఈ కళ్లాద్దాలను అంధులకు పంపిణీ చేసింది. అంధులకు మార్గనిర్దేశం చేస్తున్న స్మార్ట్ కళ్లాద్దాలపై ప్రత్యేక కథనం
అంధుల ఇబ్బందులను ఏఐ టెక్నాలజీతో అధిగమించేందుకు అనేక ఆవిష్కరణలు వస్తున్నాయి. ద్రిస్టి ఏఐ ఎనేబుల్డ్ విజనగా పిలవబడే ఈ కళ్లాద్దాలను ఇటీవల హైదరాబాదులో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ స్మార్ట్ కళ్లాద్దాలు దృష్టిలోపం ఉన్నవారికి నిత్యంమార్గనిర్దేశం చేస్తుంటాయి. ఇందులోని ఏఐ టెక్నాలజీ అంధులకు వస్తువులను, మనుషులను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. రీడింగ్ అసిస్టెంట్, ఇండోర్ నావిగేషనతో నడిచే ఈ స్మార్ట్‌గ్లాసెస్ అంధులకు ఎంతో ఉపయుక్తంగా మారింది.
అధ్యయనంలో దినే్‌షరెడ్డి
ద్రిస్టి ఏఐ ఎనేబుల్డ్ విజన అద్దాలను ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావుకు అందజేశారు. ఆ కళ్లాద్దాలను అధ్యయనంతో పాటు సద్వినియోగం చేసుకునేందుకు ఆయన నల్లగొండ పట్టణంలోని బ్యాంకు ఉద్యోగి, అంధుడైన దినే్‌షరెడ్డికి అందించారు. ఆయన రెండు రోజులపాటు ఆ గ్లాసుల పనితీరును అధ్యయనం చేశారు. ఈ స్మార్ట్ కళ్లాద్దాల ధరలు అధికంగా ఉండటంతో పేద, మధ్య తరగతి అంధులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి అందిస్తే అంధులకు ఇది ఉపయోగపడుతుంది. చదువుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అంధ యువతీ, యువకులకు ఈ కళ్లాద్దాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంధులు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి తోడు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అంధులు కోరుతున్నారు.
స్మార్ట్‌గ్లాసె్‌సలో ఫీచర్స్...
ఏఐ ఆధారిత గ్లాసె్‌సను మొబైల్ అప్లికేషనతో అనుసంధానించుకోవాలి. చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తెలుసుకునేందుకు ఈ స్మార్ట్ కళ్లాద్దాలకు అనుసంధానంగా కెమెరాను ఏర్పాటు చేశారు. ఇందులో చిన్నపాటి స్పీకర్ ఉంటుంది. ఇది పరిసరాలను అంధులకు స్పీకర్‌లో వినిపిస్తుంటుంది. బ్లూటూత వైఫై సెన్సార్ల ద్వారా వెళ్లే మార్గాన్ని, నావిగేషనను అందిస్తుంది. ఈ అద్దాలు ధరించిన వ్యక్తి ఎదుటగా ఉన్న వ్యక్తులను పరిసరాలను స్కానింగ్ చేసి ఆడియో ద్వారా వినిపిస్తుంది. అరగంట సేపు చార్జింగ్ చేస్తే నాలుగు గంటల పాటు ఈ కళ్లాద్దాల సేవలను వినియోగించుకోవచ్చు.
అంధుల, దివ్యాంగుల సంక్షేమంపై
ప్రభుత్వం దృష్టి సారించాలి
రాష్ట్రంలోని అంధుల, దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ద్రిస్టి స్మార్ట్ కళ్లాద్దాలు అంధులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతీ ఒక్క అంధుడికి ఈ కళ్లాద్దాలను అందించాలి. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం స్వయం ప్రతిపత్తితో కూడిన కమిషనర్‌ను నియమించాలి. ప్రత్యేక కమిషనర్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
పొనుగోటి చొక్కారావు, డ్వాబ్ ప్రధానకార్యదర్శి
స్మార్ట్ గ్లాసె్‌సతో అంధులకు ప్రయోజనం
ద్రిస్టి స్మార్ట్ కళ్లాద్దాలతో అంధులకు ఎంతో ఉపయో గం. అయితే దీని ధర రూ.15 వేలు ఉంది. ఇంత ధర పెట్టి పేద కుటుంబాలకు చెందిన అంధులు కొనుగోలు చేయలేరు. ప్రభుత్వం పంపిణీ చేసి ఆదుకోవాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నల్లగొండలో డ్వాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాలలో చదువుకున్నా. ఈ కళ్లాద్దాలను డ్వాబ్ ప్రధాన కార్యదర్శి చొక్కారావు అందించారు. ఇది ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్‌గ్లా్‌సలు అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు.
దినే్‌షరెడ్డి, బ్యాంకు ఉద్యోగి, నల్లగొండ.