Share News

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

ABN , Publish Date - Jan 31 , 2024 | 11:54 PM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు.

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల
ఎడమ కాల్వలోకి విడుదలవుతున్న నీరు

నాగార్జునసాగర్‌, జనవరి 31 : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఖమ్మం పట్టణ తాగునీటి అవసరాల కోసం పాలేరు జలాశయాన్ని నింపేందుకు రోజుకు 6,000 క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు రెండు టీఎంసీల మేర నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని, రైతులు మేజర్లు, మైనర్ల వద్ద షట్టర్లు ఎత్తి నీటిని వాడుకోరాదన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల ప్రారంభించి గంట, గంటకు 1000 క్యూసెక్కులు పెంచుతూ 6000 క్కూసెక్కుల వరకు విడుదల చేస్తామన్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 520 అడుగులుగా(149.2750 టీఎంసీలు) నమోదైంది. సాగర్‌ నుంచి ఎడమ కాల్వ ద్వారా 2,000 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 900 క్కూసెక్కులు, ప్రధాన జలవిద్యుత కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 7,661 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 10,561 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు.

Updated Date - Jan 31 , 2024 | 11:54 PM