Share News

సంక్షేమమే ప్రధాన ధ్యేయం

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:51 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.హనుమంత్‌రావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..

సంక్షేమమే ప్రధాన ధ్యేయం

జిల్లా అభివృద్ధిని ఛాలెంజ్‌గా తీసుకుంటాం

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారం

కలెక్టర్‌ ఎం.హనుమంతరావు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎం.హనుమంత్‌రావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..

జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం ఛాలెంజ్‌ గా పనిచేస్తోంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తాం.ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని, పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది, ఈ సంక్షే మ ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా చూస్తాం. ప్రజలనుంచి వచ్చే ప్రతీ అర్జీని కూడా పరిశీలిం చి, క్షేత్రస్థాయిలో ఆ సమస్యలు వెంటనే పరిష్కరి స్తాం. జిల్లాలోని ప్రజలందరికీ మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్యనందించేందుకు అన్నిశాఖలు సమన్వయంతో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పనపై సంబంధిత శాఖలతో సమీక్షించి, ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ప్రాధాన్యతగల సంక్షేమ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పక్కాగా అమలు అయ్యేలా చేస్తాం.

పథకాల అమలు తీరుపై తనిఖీలు

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు అమలు తీరుపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు చేపట్టనున్నాం. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నియోజకవర్గానికి 3500 నుంచి 4వేల ఇళ్లను మంజూరు చేయనుంది. వీటన్నింటిని అర్హులకు అందేలా కృషి చేస్తాం. జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైకు అందేలా చూస్తాం. జిల్లాలో సాగునీటి రిజర్వాయర్లు, కాల్వల పునరుద్ధరణ, మూసీ నది పునరుజ్జీవం వంటి అంశాలపై అధ్యయనం చేస్తాం. ప్రభుత్వం ప్రాధాన్యక్రమంలో నిధులు కేటాయిస్తుంది. ఆ మేరకు పనులు పూర్తయ్యేలా తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తాం.

సర్వేకు సన్నద్ధం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే)కు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈసర్వేలో ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తాం. సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల గుర్తించి, వారికి శిక్షణ అందిస్తున్నాం. గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేయనున్నాం.

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేకశ్రద్ధ

రైతులు పండించిన ధాన్యాన్ని మద్దత .ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేసిన కేంద్రాల్లోనే విక్రయించాలి. ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే చాలా వరకు సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగతా వాటిని కూడా ధాన్యం రాకను బట్టి ఏర్పాటు చేస్తాం. రైతులు ధాన్యం అరబెట్టి, 17శాతం తేమతో కేంద్రాల్లో విక్రయించాలి. జిల్లావ్యాప్తంగా దాదాపు 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:51 AM