రాబోయేది ప్రజా పోరాటాల కాలమే
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:24 AM
రాబోయేది ప్రజా పోరాటాల కాలమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బుధవారం భువనగిరిలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్మికుల కనీస వేతనాలు, విద్య, ఉపాధి, వైద్యం, మహిళా సంరక్షణ, వ్యవసాయ రైతు సమస్యలపై తీర్మానాలు చేశామన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్
భువనగిరి గంజ్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాబోయేది ప్రజా పోరాటాల కాలమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బుధవారం భువనగిరిలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్మికుల కనీస వేతనాలు, విద్య, ఉపాధి, వైద్యం, మహిళా సంరక్షణ, వ్యవసాయ రైతు సమస్యలపై తీర్మానాలు చేశామన్నారు. రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలు, వ్యవసాయం, చేతివృత్తులు, పాడి పరిశ్రమ, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, మండలం మొత్తం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తికోసం ఇంకా ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని, గౌరెల్లి భూనిర్వాసితుల పోరాటం, రాచకొండ భూములైన సర్వే నెం.273, సర్వేనె.ం106, సర్వే నెం.96లలో అనేక మంది పేద రైతులు 1000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలకోసం పోరాటం చేస్తామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, చిన్న నీటి ప్రాజెక్టులైన పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, ఆసి్‌ఫనహర్ పూర్తికోసం ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. మూడోసారి జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరు బాల్‌రాజు, కల్లూరి మల్లేషం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, నాయకులు వనం రాజు, వల్లందాసు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.