Share News

మరమ్మతుల నిధులతో ఏ పనులు చేశారు?

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:18 AM

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలో గండ్లు పడిన ప్రాంతాల్లో నిధులు ఎలా ఖర్చుచేశారని ఎన్నెస్పీ ఇంజనీర్‌ ఇన చీఫ్‌ అనిల్‌కుమార్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మరమ్మతుల నిధులతో ఏ పనులు చేశారు?
కాగితరాంచంద్రాపురం వద్ద ఎడమకాల్వపై పనులను పరిశీలిస్తున్న ఈఎనసీ

నడిగూడెం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలో గండ్లు పడిన ప్రాంతాల్లో నిధులు ఎలా ఖర్చుచేశారని ఎన్నెస్పీ ఇంజనీర్‌ ఇన చీఫ్‌ అనిల్‌కుమార్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో గండ్లు పడిన ప్రాంతాల్లో చేపట్టిన పనులను సోమవారం ఆయన పరిశీలించారు. మరమ్మతులకు ప్రభుత్వం రూ.9కోట్లు మంజూరుచేయగా, ఆ నిధులతో పనులు ఎలా చేశారు, ఏం చేశారు, నీటి విడుదల సాఫీగా ఉందా, పాలేరు రిజర్వాయర్‌ నుంచి బ్యాక్‌ వాటర్‌ పరిస్థితిని ఆయన స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద గండి మరమ్మతులకు రూ.2కోట్లు, ఖమ్మం జిల్లాలో కుసుమంచి మండలంలో కుడి కాల్వ మరమ్మతులకు రూ.5కోట్లు, విద్యుత పాజెక్టు మరమ్మతులకు రూ.2కోట్లు మంజూరుకాగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగర్‌ ఎడమకాల్వ ద్వారా పాలేరు వరకు 6.5లక్షల ఎకరాలకు, పాలేరు రిజర్వాయర్‌ నుంచి ఖమ్మం జిల్లా 2.54లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరందిస్తుండగా ఆ మేరకు చివరి భూములకు నీరు అందుతుందా లేదా అని తెలుసుకున్నారు. పాలేరు రిజర్వాయర్‌ నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రసుత్తం 18.5 అడుగులు నీరు ఉందని అధికారులు ఈఎనసీకి తెలిపారు. పనుల వివరాలను తెలుసుకున్న ఆయన సాయంత్రం నీటి పారుదలశాఖ మంత్రి ఎన.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో వీడియోకాన్ఫరెన్సలో పాలొన్నారు. కార్యక్రమంలో నీటిపారుల శాఖ సీఈ రమే్‌షబాబు, ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ రామకిషోర్‌, డీఈ రఘు, ఏఈలు సత్యనారాయణ, సరిత, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు రామకృష్ణ, దామదాసు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:18 AM