Share News

ముందుకు పోతది అనుకుంటే వెనక్కిపోతోంది

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:18 AM

రాష్ట్రంలో అభివృద్ధి మార్పుతో ముందుకు పోతది అని ప్రజలు నమ్మితే వెనక్కి పోతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

ముందుకు పోతది అనుకుంటే వెనక్కిపోతోంది
సెమిక్రిస్మస్‌ వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి మార్పుతో ముందుకు పోతది అని ప్రజలు నమ్మితే వెనక్కి పోతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓఫంక్షనహాల్‌లో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఏర్పాటుచేసిన ప్రేమవిందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వమతాలకు ప్రాధాన్యమిస్తూ గతంలో కేసీఆర్‌ రంజాన, క్రిస్మస్‌ సందర్భంగా దుస్తులు పంపిణీ చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాక ముందే దుస్తులు మాయమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఏడాది వరకు ఇంకేం ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి కనిపిస్తోందన్నారు. పండుగల వేళ రాజకీయాలు మాట్లాడటం అలవాటు లేదని, కానీ ప్రజల కోసం మాట్లాడక తప్పడంలేదన్నారు. ప్రస్తుతం పండుగలను మరిచిపోయేలా కాంగ్రెస్‌ పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్‌చైర్మన పుట్ట కిషోర్‌కుమార్‌, ఆర్డీవో వేణుమాధవ్‌, జిల్లా మైనార్టీ శాఖ అధికారి జగదీ్‌షరెడ్డి, దుర్గం ప్రభాకర్‌, వరికుప్పల మత్తయ్య, డానియేలు, గాబ్రియేలు, జెమ్స్‌, బాలాజీనాయక్‌, సజీవ, ఇరుగు శ్యాంసన, లాజర్‌, రూబెన, బాబురావు, మార్క్‌, క్రిస్టోఫర్‌, అబ్రహం పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 12:18 AM