సంగమస్థలికి పర్యాటక శోభ వచ్చేనా?
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:54 AM
సంగమ స్థలికి పర్యాటక శోభను సంతరించుకోవాలని వలిగొండ మండల పరిసర గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్ష.
సీఎం పర్యటన నేపథ్యంలో చిగురిస్తున్న ఆశలు
వలిగొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సంగమ స్థలికి పర్యాటక శోభను సంతరించుకోవాలని వలిగొండ మండల పరిసర గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్ష. మూసీ నది, ఇంద్రసాగర్, చిన్నేరువాగు మూడు నదులు వలిగొండ మండలంలోని సంగెం వద్ద కలుస్తాయి ఇక్కడే మహిమాన్విత భీమలింగం ఉంది. ఈ క్షేత్రం త్రివేణి సంగమంగా పేరొందింది. రాచకొండ సంస్థానాన్ని ఏలిన సింగభూపాలుని కాలంలో మూసీ నదికి మధ్యలో భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికులు చేప్పుకుంటారు. కార్తీకమాసంలో స్నానాలు ఆచరించి భీమాలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించ డం ఆనవాయితీ ఇక్కడికి వచ్చిన భక్తులు భీమలింగా న్ని ఆలింగానం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు.
పర్యాటకా క్షేత్రంగా అభివృద్ధి
సీఎం రేవంత మూసీ పునర్జీవన యాత్ర సంగెం పరిసరల ప్రాంతం పర్యాటక క్షేత్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందనుందని స్థానికుల ఆశాభావం వ్యకతం చేస్తున్నారు. మూసీ నదిలో స్నానాలు ఆచరించ లేకపోతున్నామని ఆవేదన ఉంది. ఈ మూసీ పునరుజ్జీవ యాత్రతో పూర్వవైభవం రాబోతుందని ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కులవృత్తులతో సమావేశం
మూసీ పరివాహక సమస్యలలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి కులవృత్తులతో అధికారులు స్థానిక నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గౌడ కులం, పద్మశాలి, రజక, మత్స్యకార్మికులు, రైతు కూలీల వంటి వృత్తుల వారికి ఇద్దరిద్దరికి సీఎంతో మాటమంతికి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది.
యాత్ర ఏర్పాట్లకు తుది దశ
సీఎం రేవంతరెడ్డి పునర్జీవ యాత్ర నేడు శుక్రవారం జరగనున్న కారణంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కొనసాగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. భీమలింగం వంతెన పైన ఇరువైపులా, ధర్మారెడ్డి కాల్వ ఇరువైపులా పోలీసులు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. భీమలింగం కాల్వకు రంగులతో సుందరంగా అలంకరించారు. భీమలింగాన్ని దర్శించుకునేందుకు దారిని ఏర్పాటు చేశారు. ఈ పునరుజ్జీ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు తుదిదశకు చేరాయి.
వలిగొండ మండల అభివృద్ధిపై ప్రజల ఆశాభావం
వలిగొండ మండలం జిల్లాలో అతి పెద్దది. 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పరిపాలన దృష్య్టా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలాన్ని మరో నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2018 జూన 24న వేముల కొండ గ్రామ పరిధిలో మూసీ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదానికి కారణమైన కాల్వ కట్టను వెడల్పు చేయాలని స్తానికులు కోరుతున్నారు. మత్స్యగిరి గుట్ట దేవస్థానాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా ఆధునీకరించి వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. ఇంటి గ్రేటెడ్ స్కూల్‌ను స్థాపించాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని, వలిగొండలో గతంలో ప్రారంభించిన బాలికల గురుకుల పాఠశాలను బీబీనగర్ నుంచి తిరిగి వలిగొండకు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాన్సఫార్మర్ల రిపేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషనకు బీటీ రోడ్డు నిర్మించి వలిగొండ స్టేషనలో పలు రైళ్లు ఆగేటట్లు చూడాలని స్థానికులు కోరుతున్నారు. నాగారం రైల్వే గేట్ వద్ద ప్లైఓవర్‌ను నిర్మించి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని, ఆర్‌ఆర్‌ఆర్ అలైన్మెంట్‌ను మొదటి ప్రతిపాదికన ప్రకారం కొనసాగించాలని, ఒక వేళ సాధ్యం కానిచో బహిరంగ మార్కెట్ ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలని కోరతున్నారు. ప్రొద్దటూరు నుంచి వర్కట్‌పల్లి గ్రామాల నడుమ ఉన్న మూసీ నదిపై వంతెన నిర్మించాలని, కళ్లెవారి బావి వద్ద శిఽథిలావస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో నూతన వంతెన నిర్మించాలని కోరుతున్నారు. మూసీ కాల్వలు, భీమలింగం, ఆసీ్‌ఫనగర్ కాల్వ కట్టలను వెడల్పుచేయాలని, రైతులు తమ పొలం పనులకు వెళ్లడానికి దారులను పునరుద్ధరించాలని కోరుతున్నారు.