Share News

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో సంచలనం..

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:09 PM

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు..

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో సంచలనం..
Jani Master Case

హైదరాబాద్, డిసెంబర్ 25: జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాటుపడినట్లు పోలీసుల నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. టాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్.. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాద్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25వ తేదీన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

Updated Date - Dec 25 , 2024 | 06:33 PM