New buses: వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తబస్సులు.. జూన్‌నాటికి సంఖ్య పెంపు..
ABN , Publish Date - Mar 05 , 2024 | 12:33 PM
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. జూన్‌నాటికి గ్రేటర్‌లో బస్సుల సంఖ్య పెంచేదిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీ: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. జూన్‌నాటికి గ్రేటర్‌లో బస్సుల సంఖ్య పెంచేదిశగా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తబస్సులకు ప్రభుత్వం నిధులు కేటాయించాలంటూ టీఎ్‌సఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఎలక్ర్టిక్ బస్సులు(Electric buses) రావడంలో ఆలస్యమైతే ముందు డీజిల్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేదిశగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం 2,638 బస్సులున్నాయని, వాటిని 3,638లకు పెంచే లక్ష్యంగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆరు నెలల్లో 500 ఎలక్ర్టిక్, మరో 500 డీజిల్ బస్సులు గ్రేటర్‌లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.