Share News

B.R. Nayudu: కొలువుదీరిన టీటీడీ బోర్డు

ABN , Publish Date - Nov 07 , 2024 | 02:58 AM

తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడుతో పాటు మరో 14 మంది సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

B.R. Nayudu: కొలువుదీరిన టీటీడీ బోర్డు

  • చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, 15 మంది సభ్యుల ప్రమాణం

తిరుమల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడుతో పాటు మరో 14 మంది సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఆలయంలోని బంగారు వాకిలి వద్ద బీఆర్‌ నాయుడుతో ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యులుగా దేవదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖర గౌడ్‌, జాస్తి పూర్ణ సాంబశివరావు, ఎంఎస్‌ రాజు, నర్సిరెడ్డి, మహేందర్‌రెడ్డి, రంగశ్రీ, రామ్మూర్తి, ఆనంద్‌సాయి, జానకీదేవి, దర్శన్‌, శాంతారామ్‌, నరే్‌షకుమార్‌, అదిత్‌ దేశాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.


వీరితో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. బుధవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సభ్యులు, సీనియర్‌ అధికారులతో తొలి సమావేశం, పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘టీటీడీలో చాలా సవాళ్లు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమిస్తాం. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకోవాలి. భక్తులకు మెరుగైన సౌకర్యాలపై నిర్ణయాలు తీసుకుంటాం’ అని అన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 02:58 AM