Share News

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:06 AM

కువైట్‌-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్‌ జిల్లావాసి రాథోడ్‌ నాందేవ్‌.

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి)/(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి), అక్టోబరు 5 : కువైట్‌-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్‌ జిల్లావాసి రాథోడ్‌ నాందేవ్‌.. సీఎం రేవంత్‌ చొరవతో రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ ఇంటి పని వీసాపై కువైట్‌ వెళ్లాడు. అరబ్‌ యజమాని అతడిని కువైట్‌ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. ‘‘యజమాని హింసను తట్టుకోలేకపోతున్నాను.


ఎడారి నుంచి నన్ను రక్షించండి’’ అంటూ రాథోడ్‌ నాందేవ్‌ ఆగస్టులో రేవంత్‌ను వేడుకుంటూ పంపిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సీఎం ఆదేశాలతో తెలంగాణ జీఏడీ ఎన్నారై శాఖ అధికారులు, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి రంగంలోకి దిగారు. కువైట్‌, సౌదీ అరేబియాలోని ఇండియన్‌ ఎంబసీలతో.. అక్కడి సామాజిక సేవకులతో మాట్లాడి నాందేవ్‌ స్వదేశానికి వచ్చేలా చేశారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌(సాటా) బృందం సహకరించింది. ఇటీవలే నగరానికి చేరుకున్న రాథోడ్‌ శనివారం రేవంత్‌ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.

Updated Date - Oct 06 , 2024 | 03:06 AM