Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
ABN , Publish Date - Jun 26 , 2024 | 06:20 PM
హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంపు ఎన్ఆర్‌వీ వాల్వ్ మరమ్మతులకు గురైంది. దాంతో నీటి సరఫరా అత్యవసరంగా నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్, జూన్ 26: హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంపు ఎన్ఆర్‌వీ వాల్వ్ మరమ్మతులకు గురైంది. దాంతో నీటి సరఫరా అత్యవసరంగా నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో అటు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారు. ఈ మరమ్మతు పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం ఏర్పడుతుందని, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం ఏర్పడుతుంది. ఇక పలు ప్రాంతాల్లో లో ప్రెజర్‌తో నీరు సరఫరా కానుంది.
దీంతో ఎన్‌పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్ (MES), కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్, వైశాలి నగర్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్‌పేట్, బడంగ్‌పేట్, శంషాబాద్ తదిరత ప్రాంతాలకు నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు ఆ యా ప్రాంతాల్లోని ప్రజలకు సూచించారు.
For More National News and Latest Telugu News click here