Share News

Indrakaran Reddy: 40 ఏళ్లలో ఎవ్వరూ ఇంత సాహసం చేయలేదు..

ABN , Publish Date - Jul 18 , 2024 | 01:53 PM

రైతులకు రెండు లక్షల ఋణమాపి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

Indrakaran Reddy: 40 ఏళ్లలో ఎవ్వరూ ఇంత సాహసం చేయలేదు..

హైదరాబాద్: రైతులకు రెండు లక్షల ఋణమాపి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఋణమాఫీ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు రైతు రుణమాఫీ అమలు చేస్తోందన్నారు. రైతు ఋణమాఫీ గురించి గతంలో చాలా ఆందోళనలు జరిగినా.. ఎవ్వరూ ఇంత ధైర్యం చేయలేదని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.


మొదటి దఫా 11లక్షల 50 వేల మంది రైతులకు లక్ష లోపు రూ.7వేల కోట్లు సాయంత్రం నాలుగు గంటలకు జమ అవుతుందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మూడు దఫాలుగా 39 లక్షల మంది రైతులకు 31 వేల కోట్లు రైతుల అకౌంట్‌లో ప్రభుత్వం వేస్తుందని అన్నారు. రేషన్ కార్డు కుటుంబ వివరాల కోసమేనని తెలిపారు.పాస్ బుక్ ద్వారా రైతులందరికీ ఋణమాఫీ జరుగుతుందని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు సాధారణంగా వస్తాయని.. సమస్యలను స్థానిక అధికారులు పరిష్కరిస్తారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.


40 ఏళ్లలో ఇంత గొప్ప కార్యక్రమం జరగలేదని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే బాగుంటుందన్నారు. సాయంత్రం నుంచి రైతు వేదికల వద్ద ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వేడుకల్లో పాల్గొనాలన్నారు. గ్రామాలలో పండగ వాతావరణం నెలకొందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజులు సంబరాలు జరుపు కోవాలని కోరుతున్నానన్నారు. గత ప్రభుత్వం లక్ష రూపాయల కూడా అందరికీ ఇవ్వలేదన్నారు. ఇది భారత దేశంలో నే చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రైతులకు రెండు లక్షల ఋణమాఫీ చేయడం రైతు బిడ్డగా గర్వంగా ఫీలవుతున్నానని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదండి...

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

High Court: బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన 11 ఎకరాలు మావే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 01:53 PM