Phone Tapping Case: బెయిల్ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా
ABN , Publish Date - Apr 24 , 2024 | 06:14 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రువారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రువారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
అయితే పోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావుల బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అందుకు ప్రతీగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు జరిగాయి.
AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ
నిందితులకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును.. ఏప్రిల్ 24 తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు సైతం వాదనలు బలంగా జరిగాయి. ఆ క్రమంలో నిందితులు బెయిల్ మంజూరు చేయవద్దంటూ.. న్యాయస్థానాన్ని పోలీసులు మరోసారి కోరారు.
Sam Pitroda Comments: బీజేపీ ఆరోపణలు.. స్పందించిన ఖర్గే
ఆ క్రమంలో బెయిల్ పిటిషన్లపై తీర్పు శుక్రవారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అయితే నిందితులకు బెయిల్ వస్తుందా ? రాదా? అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Read National News and Telugu News