Home » Nampalli
జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.
మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిగింది. అందులోభాగంగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సమాజంలో తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. అయితే వాటిని దిగజార్చాలానే ఆమె ఈ తరహా వాఖ్యలు చేసిందని కోర్టుకు కేటీఆర్ విన్నవించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
తెలుగు యూనివర్సిటీ వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని వర్సిటీలో ఆయన 12వ వీసీగా బాధ్యతలు చేపట్టారు.