BRS: కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు.. ఎందుకంటే
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:30 PM
గ్రూప్ 1 పరీక్షలు(Group 1 Exams) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్(BRS) నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షలు(Group 1 Exams) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్(BRS) నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, పదుల పోలీసు వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది.
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థుల తరఫున విపక్షాలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతున్నందనా.. రాజకీయ నిరసనలు జరగి, పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరుల ఇళ్ల బయట గస్తీ కాస్తున్నారు. మరోవైపు గ్రూప్-1 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్షలు జరగనున్నాయి. 1.30కు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు అధికారులు చెప్పారు.
KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్
Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి
For Latest News and National News click here