Share News

Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:59 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. టీ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు పొన్నం మీడియాతో మాట్లాడుతూ..

Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ఘాటు వ్యాఖ్యలు

కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay).. టీ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసని.. బండి సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని విమర్శించారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.

పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్..


తాము ధర్మం తప్పలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. మా పార్టీలో చేరుతున్న వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటే.. నిలబెట్టడానికి వారు వస్తున్నారన్నారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలని స్పష్టం చేశారు. కుల గణన పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు..

బీమా పేరుతో రైతన్నలకు జగన్‌ దగా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2024 | 12:59 PM