Rahul Gandhi: కేసీఆర్ చేసిందే మోదీ చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌పై రాహుల్ సంచలనం
ABN , Publish Date - Apr 06 , 2024 | 09:20 PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వేలాది ఫోన్లను ట్యాప్ చేసిందని.. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వేలాది ఫోన్లను ట్యాప్ చేసిందని.. మాజీ సీఎం కేసీఆర్ (KCR) అధికార దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు. అధికారం పోగానే.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల డేటాను నాశనం చేశారని చెప్పారు. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణలోని బీజేపీ-బీ టీమ్‌ని ఓడించామని, ఇక ఏ టీమ్‌ని ఓడిస్తామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేసినట్లే.. ప్రధాని మోదీ (PM Narendra Modi) కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు గుప్పించారు.
Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం
కేంద్రంలోని బీజేపీ ఒక పెద్ద వాషింగ్ మెషిన్ నడిపిస్తోందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎక్స్‌టార్షన్ డైరెక్టరేట్‌గా మారిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాపారస్తులను సీబీఐ భయపెట్టి, బీజేపీకి ఫండింగ్ చేయించిందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్‌లను బ్లాక్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని.. కానీ తాము అలా చేయనివ్వమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తాము పోరాటంచేస్తున్నామన్నారు. కేవలం మూడు శాతం ప్రజల కోసమే ప్రధాని మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. మోదీ దగ్గర డబ్బులు, ఈడీ, సీబీఐ ఉన్నాయని.. కానీ తమ దగ్గర నిజాయితీ, ప్రజల ప్రేమ ఉందని రాహుల్ చెప్పుకొచ్చారు.
India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?
అంతకుముందు.. న్యాయపత్రం పేరిట రాహుల్ గాందీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని.. సంవత్సరానికి రూ.1 లక్ష స్టైఫండ్‌తో ట్రైనింగ్ ఇప్పిస్తామని అన్నారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.1 లక్ష ఇస్తామని, ఆ డబ్బులను నేరుగా బ్యాంకుల్లో వేస్తామని మటిచ్చారు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు.. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు కనీసం వేతనాన్ని రోజుకి రూ.400 చేస్తామని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి