Share News

Htderabad: బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో..

ABN , Publish Date - May 16 , 2024 | 04:12 AM

హైదరాబాద్‌ మలక్‌పేటలోని బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో ప్రముఖ రెనోవా హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు రెనోవా హాస్పిటల్స్‌ చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ పి.శ్రీధర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రిని అత్యాధునిక క్యాన్సర్‌ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెనోవా బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రిగా ప్రారంభించినట్లు తెలిపారు.

Htderabad: బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో..

  • రెనోవా హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఒప్పందం

చాదర్‌ఘాట్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మలక్‌పేటలోని బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో ప్రముఖ రెనోవా హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు రెనోవా హాస్పిటల్స్‌ చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ పి.శ్రీధర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రిని అత్యాధునిక క్యాన్సర్‌ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెనోవా బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రిగా ప్రారంభించినట్లు తెలిపారు. రెనోవా హాస్పిటల్స్‌ విస్తరణలో భాగంగా మలక్‌పేటలోని బీబీ అంకాలజీ సెంటర్‌ను అభివృద్ది చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రం భారతదేశంలో రెనోవా గ్రూప్‌ 9వ కేంద్రంగాను, 5వ అంకాలజీ కేంద్రంగానూ మారనుంది.


అధిక నాణ్యత కలిగిన వైద్య సంరక్షణ ప్రాముఖ్యతను విస్తరించడానికి ఉత్తమ సేవల ద్వారా రోగుల శ్రేయస్సును మెరుగుపరచడానికి రెనోవా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా రేడియేషన్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌లలో సాంకేతికత అభివృద్ధి కోసం రూ.40కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు. త్వరలో విద్యానగర్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ హాస్పిటల్‌ నుంచి కూడా రెనోవా హాస్పిటల్స్‌ గ్రూప్‌ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో రెనోవా హాస్పిటల్స్‌ వైద్యసేవలు విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. బీబీ అంకాలజీ సెంటర్‌ చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ సయ్యద్‌ నిస్సార్‌ మాట్లాడుతూ.. 1984లో స్థాపించిన తమ ఆస్పత్రి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రైవేటు అంకాలజీ హాస్పిటల్‌గా పేరొందిందన్నారు.

Updated Date - May 16 , 2024 | 04:14 AM