Revanth Reddy: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్.. మరో 30 వేల పోస్టుల భర్తీ
ABN , Publish Date - Jul 26 , 2024 | 01:52 PM
తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో భర్తీ అయిన 483 మంది ఫైర్‌మెన్ అభ్యర్థులకు ఇవాళ శిక్షణ పూర్తి అయిన విషయం తెలిసిందే. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వీరంతా నాలుగు నెలలుగా తీసుకుంటున్న శిక్షణ నేటితో పూర్తయింది.
హైదరాబాద్: తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ (Fire Department)లో భర్తీ అయిన 483 మంది ఫైర్‌మెన్ అభ్యర్థులకు ఇవాళ శిక్షణ పూర్తి అయిన విషయం తెలిసిందే. తెలంగాణ విపత్తు నిర్వహణ (Telangana Disaster Management), అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వీరంతా నాలుగు నెలలుగా తీసుకుంటున్న శిక్షణ నేటితో పూర్తయింది. ఈ క్రమంలోనే ఇవాళ ఫైర్ మెన్ అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridharbabu) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారన్నారు.
ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ (Telangana) పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశామన్నారు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతోందన్నారు. అందులో భాగంగానే విద్య (Education), వ్యవసాయా (Agriculture) నికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ (Budget)లో ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees)కు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వం (Telangana Government)పై విశ్వాసం కల్పించామని రేవంత్ తెలిపారు. 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60 వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు. వారికి ఏవైనా సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని రేవంత్ తెలిపారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?
Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాభాల స్టాక్స్!
Read Latest Telangana News And Telugu News