Share News

TG News: రూ.12 లక్ష విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత..

ABN , Publish Date - Sep 05 , 2024 | 09:40 AM

12 లక్షల రూపాయల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. రూ.12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మొత్తంగా 12 మంది పై కేసు నమోదు చేశారు.

TG News: రూ.12 లక్ష విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత..

హైదరాబాద్: 12 లక్షల రూపాయల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. రూ.12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మొత్తంగా 12 మంది పై కేసు నమోదు చేశారు. గోవా నుంచి ఎయిర్ పోర్టు ద్వారా ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 12 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి , డిసి రంగారెడ్డి దశరథ్, ఏసి ఆర్ కిషన్, ఏఈ ఎస్ జీవన్ కిరణ్ ఎన్ఫోర్స్‌మెంట్ టీములు రెండు, శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీస్ టీమ్ కలిసి టీమ్స్ కలిసి ఈ రాకెట్ గుట్టును రట్టు చేశారు.


శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శంషాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. గోవా నుంచి మద్యం తీసుకోని వస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి 415 బాటిలను పట్టు కున్నారు. మద్యం బాటిళ్లను పట్టుకొస్తున్న 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 415 లీటర్ల మద్యం బాటిళ్లలో 352.68 లీటర్ల మద్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుంది. వీటి కారణంగా ఒక్కో బాటిల్‌పై పెద్ద మొత్తంలో ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌‌పై ఎక్సైజ్ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. అయినా సరే ఏదో ఒకరకంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు అక్రమార్కులు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 10:35 AM