Hyderabad: సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ మృతి
ABN , Publish Date - Sep 27 , 2024 | 03:36 AM
సీనియర్ జర్నలిస్టు, ఈటీవీ హైదరాబాద్ బ్యూరోచీ్‌ఫగా పనిచేస్తున్న తన్నీరు ఆదినారాయణ (48) గురువారం ఉదయం మృతి చెందారు.
హైదరాబాద్, అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు, ఈటీవీ హైదరాబాద్ బ్యూరోచీ్‌ఫగా పనిచేస్తున్న తన్నీరు ఆదినారాయణ (48) గురువారం ఉదయం మృతి చెందారు. తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో వాకింగ్ చేస్తూ కళ్లు తిరగడంతో అక్కడి నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను కుటుంబసభ్యులు మియాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మియాపూర్ వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆదినారాయణ, రమాదేవి దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. ఆయన 25 ఏళ్లుగా ఈటీవిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు.
కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదినారాయణ పార్ధివదేహం వద్ద ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్‌గౌడ్, పలువురు జర్నలిస్టులు నివాళులర్పించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జర్నలిస్టు ఆదినారాయణ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మృతి బాధాకరమని, ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్నిప్రసాదించాలని కోరుకుంటున్నానని రేవంత్ తెలిపారు.