September 17th: జాతీయ జెండాల ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 11 , 2024 | 08:00 PM
ప్రజా పాలన దినోత్సవంగా 17వ తేదీన నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ రోజున మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 32 జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే నేతల పేర్లను విడుదల చేశారు.
హైదరాబాద్: నిజాం రాజు కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17వ తేదీన విమోచనం కలిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేవారు. ఒక్కో ప్రభుత్వ హయాంలో ఒక్కో పేరుతో నిర్వహించేవారు. విలీనం అని ఒకరు, విమోచనం ఇంకొకరు.. విద్రోహ దినం అని రకరకాల పేర్లతో పిలిచే వారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమైక్యత దినోత్సవంగా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డే)గా నిర్వహిస్తామని ప్రకటన చేసింది.
జాబితా ఇదే..
ప్రజా పాలన దినోత్సవంగా 17వ తేదీన నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ రోజున మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 32 జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే నేతల పేర్లను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల ఆఫీసులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేయాలి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నేపథ్యం..
తెలంగాణ రాష్ట్రంలో 1945లో రైతుల తిరుగుబాటు ప్రక్రియ మొదలైంది. వెట్టి చాకిరీ, భగీలా, లెవీ విధానం, జాగీర్దార్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. తెలంగాణ మాత్రం నిజాం పాలనలో మగ్గుతోంది. బ్రిటిష్ ఇండియాలో ఉన్న భూభాగాన్ని మాత్రమే బ్రిటిష్ వారు అప్పగించారు. సంస్థానాలు దేశంలో కలవాలా లేదా అనే నిర్ణయాన్ని వాటికే వదిలేశారు. దాంతో నిజాం రాజు భారతదేశంలో కలిసేందుకు అంగీకరించలేదు.
పటేల్ చొరవతో..
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవతో నిజాం రాజు తొకముడిచారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం రాజు కబంధ హస్తాల తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించేవారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన చేసింది.