Share News

Hydra: హైడ్రా కూల్చివేతలకు బ్రేక్

ABN , Publish Date - Sep 02 , 2024 | 01:02 PM

చినుకు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తేలికపాటి జల్లులకే నగరం చిత్తడి అవుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని కాలనీలు జలమయం అయ్యాయి. గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు ఉన్నాయి. దాంతో సిటీలో కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది.

Hydra: హైడ్రా కూల్చివేతలకు బ్రేక్
Short Break To Hydra Demolitions

హైదరాబాద్: హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా గుబులు రేపుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా కాస్త సైలంట్ అయ్యింది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. గత రెండురోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఆ ప్రభావం ఎక్కువే ఉంది. సిటీ, శివారులో వర్ష బీభత్సం ఉండటంతో సహాయక పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు.


HYDRA.jpg


చినకుపడితే చిత్తడే..

చినుకు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. తేలికపాటి జల్లులకే నగరం చిత్తడి అవుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని కాలనీలు జలమయం అయ్యాయి. గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు ఉన్నాయి. దాంతో సిటీలో కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాత్రం బిజీగా ఉన్నారు. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన్ పాయింట్స్, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీల్లో పర్యటిస్తున్నారు. నీరు ఉన్నప్పుడే ఆ ప్రాంతాలను సందర్శించి మార్క్ చేసుకుంటున్నారు. తర్వాత నోటీసులు అందజేసే అవకాశం ఉంది.


HYDRA.jpg


200 నిర్మాణాల కూల్చివేత

ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారికి ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు తీసుకున్న వారు వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని అందులో స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే 200కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. అందులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఉంది. తర్వాత కేటీఆర్ జన్వాడా ఫామ్ హౌస్, అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి చెందిన ఇల్లు, ఆఫీసుకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు అందజేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూల్చివేతల పనిలో హైడ్రా బిజీగా ఉండనుంది.

ఇది కూడా చదవండి:

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!

Updated Date - Sep 02 , 2024 | 01:33 PM