Diwali Bonus: సింగరేణి మాజీ కార్మికులకు 27న బోనస్
ABN , Publish Date - Nov 24 , 2024 | 03:55 AM
సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు ఈ నెల 27న దీపావళి బోన్‌సను జమచేయాలని సంస్థ నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు ఈ నెల 27న దీపావళి బోన్‌సను జమచేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 24కు వరకు పదవీ విరమణ చేసిన వారికి ఈ సొమ్మును విడుదల చేస్తున్నామని తెలిపారు. బుధవారం వారి ఖాతాల్లో బోనస్ సొమ్ము జమవుతుందని చెప్పారు. 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ. 93,750 చొప్పున రూ.18.27 కోట్లను విడుదల చేయనున్నామని బాలరామ్ వెల్లడించారు.