TS News: సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం..
ABN , Publish Date - Jul 30 , 2024 | 01:29 PM
సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం జరిగింది.
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం జరిగింది. అమ్మాయికి జాబు వచ్చిందని ట్రీట్ ఇవ్వమని స్నేహితుడు గౌతమ్ రెడ్డి అడిగాడు. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డి, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం బాధితురాలు దీక్షిత, గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కి వచ్చారు. అక్కడే బార్‌లో ఇద్దరూ మద్యం సేవించి హోటల్‌లో ఉన్న రూమ్‌కి వెళ్లారు.
అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి తో పాటు మరో వ్యక్తి రూమ్‌లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది. హోటల్ సిబ్బంది రూమ్‌కు వెళ్లడంతో రూమ్‌లో ఉన్న ఇద్దరు పరారయ్యారు. బాధితురాలు రక్తం మడుగులో ఉండడంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది, బాధితురాలిని స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గౌతమ్ రెడ్డి, అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ.. నిన్న రాత్రి అమ్మాయి దీక్షితకి సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందని ఈ సందర్భంగా తన చిన్ననాటి మిత్రుడు గౌతంరెడ్డి ట్రీట్ ఇవ్వమని కోరగా ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌లో ట్రీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు మద్యం సేవించి , మరొక మిత్రుడు కలసి అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టారని ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.