Share News

Tammineni Veerabhadra: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:32 PM

సీపీఎం సీనియర్‌ నాయకుడు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadra) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్‌బులెటెన్‌లో పేర్కొన్నారు.

Tammineni Veerabhadra: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

రాయదుర్గం(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సీపీఎం సీనియర్‌ నాయకుడు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadra) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్‌బులెటెన్‌లో పేర్కొన్నారు. ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, చికిత్సకు స్పందిస్తున్నారని మరో 24-48 గంటలు చాలా కీలకమని తెలిపారు. ఆయనను సీపీఎం బీవీ రాఘవులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దని, ఆస్పత్రికి రావద్దని సూచించారు.

Updated Date - Jan 18 , 2024 | 01:35 PM