Share News

Hyderabad: సీఎంను కలిసిన 4వ తరగతి ఉద్యోగులు

ABN , Publish Date - Nov 02 , 2024 | 04:07 AM

తెలంగాణ రాష్ట్రంలోని 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జి. జ్ఞానేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి కె. గంగాధర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కోరారు.

Hyderabad: సీఎంను కలిసిన 4వ తరగతి ఉద్యోగులు

మంగళ్‌హాట్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలోని 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జి. జ్ఞానేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి కె. గంగాధర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కోరారు. ఈమేరకు శుక్రవారం వారు 4వ తరగతి ఉద్యోగులతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌, గంగాధర్‌ మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగ సంఘం కేంద్ర కార్యాలయం ఏర్పాటు నిమిత్తం వెయ్యి గజాల స్థలం కేటాయించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన 100 మంది ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేస్తున్నారని వెంటనే వారిని వెనక్కి రప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సంఘానికి స్థలం కేటాయించడంతో పాటు ఏపీలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులను వెంటనే రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

Updated Date - Nov 02 , 2024 | 04:07 AM